ప‌వ‌ర్‌స్టార్ త‌ర్వాత రౌడీ బాయ్ విజ‌య్ ఏ: దిల్ రాజు

  243
  0
  dilraju

  ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ త‌ర్వాత యూత్‌లో అంత‌టి ఇమేజ్‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌ సొంతం చేసుకున్నాడ‌ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. ప్ర‌ముఖ నిర్మాత శిరీష్ త‌న‌యుడు ఆశిష్ హీరోగా రౌడీ బాయ్స్ చిత్రం తెర‌కెక్కుతుంది. ఇందులో ప్ర‌ముఖ న‌టి క‌థానాయిక‌గా, శ్రీ‌హర్ష కొనుగంటి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఈ చిత్రంలోని రెండో సాంగ్‌ను రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్ చేశాడు.

  ఈ పాట కోసం హైద‌రాబాద్‌లో ఓ వేడుక‌ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ఈ చిత్రానికి రౌడీ బాయ్స్ టైటిల్ అనుకున్న‌ప్పుడు విజ‌య్ గుర్తు వ‌చ్చి వెంట‌నే క‌లిశాను. ఆయ‌న ఫ్యాన్స్‌ను రౌడీ బాయ్స్ అంటారా అని అడిగాను.. కాదు సార్ రౌడీస్ అంటారు అని చెప్ప‌డంతో విజ‌య్ నుంచి క్లారిటీ రావ‌డంతో ఈ చిత్రానికి రౌడీ బాయ్స్ అనే టైటిల్ పెట్టాను. ఈ సినిమా కాలేజ్ నేప‌థ్యంలో అవుట్ అండ్ యూత్ కంటెంట్‌.. ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్‌, టీజ‌ర్ ఎంతో రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక విజ‌య్ కేరింత సినిమాలో ముగ్గురు హీరోల్లో ఒక‌రిగా ఫోటో షూట్ చేయ‌డానికి వ‌చ్చాడు.

  అపుడు ఆయ‌న‌ను నేను డైరెక్ట్‌గా క‌ల‌వ‌లేదు. పెళ్లి చూపులు సినిమాను ఆయ‌న నాకు చూపించ‌డానికి ట్రై చేశాడుకానీ అపుడు నేను ఫారిన్‌లో ఉన్నాను. అందువ‌ల్ల ఆ సినిమాను రిలీజ్ చేయ‌లేక‌పోయాము. నా 25కెరియ‌ర్లో చాలా త‌క్కువ స‌మ‌యంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారికి ఫ్యాన్స్ దొరికారు. ఆ రేంజ్‌లో యూత్‌ని విజ‌య్ ప్ర‌భావితం చేశాడ‌ని..

  తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లా ఓ యూత్‌ఫుల్ స్టార్ దొరికాడ‌ని గ‌త ఫంక్ష‌న్‌లోనే చెప్పాను. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా లైగ‌ర్‌తో ఇంట్ర‌డ్యూస్ అవుతున్నాడు. నేను అడ‌గగానే ఈ చిత్ర ఈవెంట్‌కి వ‌చ్చినందుకు విజ‌య్‌కీ థ్యాంక్స్ అని దిల్ రాజ్ తెలిపాడు. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాక్‌స్టార్ దేవీశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా.. న‌వంబ‌ర్ 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here