ప్లీన‌రీ స‌మావేశ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి!

  257
  0
  trs plenary

  టీఆర్ఎస్ పార్టీ ద్విద‌శాబ్ది వేడుక‌ల్లో భాగంగా ఈ నెల 25న నిర్వ‌హించే ప్లీన‌రీ స‌మావేశానికి సంబంధించి ఏర్పాట్ల‌ను తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, ఆహ్వాన క‌మిటీ స‌భ్యులు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్ర‌భుత్వ విప్ అరేక‌పూడి గాంధీ, ఎమ్మెల్యే మాధ‌వరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు న‌వీన్‌రావు, శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్‌, మాజీ జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ లు ప‌రిశీలించారు.

  ప్లీన‌రీకి వ‌చ్చే ప్ర‌తినిధుల వాహ‌నాల కోసం ఏర్పాట్లు, ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ట్రాఫిక్ డీసీపీ విజ‌య్ కుమార్‌, జీహెచ్ఎంసీ అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత కాలానికి ముందే ఏర్పాట్ల‌న్నీ పూర్తి కావాల‌ని సంబంధిత ఇంఛార్జీల‌కు సూచించారు. అలాగే అధికారులు, పోలీసుల ప‌రంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల మీద వారికి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఎస్ ఐఐసీ ఛైర్మ‌న్ బాల‌మ‌ల్లు సివిల్ స‌ప్లై ఛైర్మ‌న్ శ్రీ‌నివాస్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here