గ‌న్‌తో డైలాగ్‌కింగ్‌.. కోపంమెక్కువంటున్న ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌!

  199
  0
  manchu mohanbabu

  డైలాగ్ కింగ్ మోహ‌న్‌బాబుకి కోపం ఎక్కువ అని ప్ర‌తి ఒక్క‌రు సినీ ఇండ‌స్ట్రీలో అనుకుంటారు అని మంత్రి త‌ల‌సాని తెలిపిన విష‌యం తెలిసిందే. ఆ కోపం తీవ్ర‌త ఎంత అంటే ఆన్ కెమెరా అయినా ఆఫ్ కెమెరా అయినా న‌చ్చ‌ని ప‌నిచేస్తున్నారంటే వాళ్లు ఎంత‌టివాళ్లైనా స‌రే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిప‌డేస్తాడు. ఇటీవ‌లే జ‌రిగిన మంచు విష్ణు ప్ర‌మాణ‌స్వీకార‌త్సోవంలో శివ‌బాల‌జీ భార్య‌కు ఏరేంజ్‌లో క్లాస్ పీకారో అంద‌రికీ తెలిసిందే. అయితే ఏ ఎన్నిక‌లైనా పోల్ మేనేజ్‌మెంట్ అనేది త‌ప్ప‌నిస‌రి.

  ఓట్లు సంపాదించ‌డానికి పోల్ మేనేజ్‌మెంట్ ఎంత బాగా చేస్తే అన్ని ఓట్లు ఎక్కువ ప‌డ‌తాయి. గ‌డిచిన మా ఎన్నిక‌ల్లో మంచు విష్ణు పోల్ మేనేజ్‌మెంట్ స‌ఫ‌లీకృతం కావ‌డం వ‌ల్లే ప్ర‌కాశ్‌రాజ్‌పై విజ‌యం సాధించాడ‌నేది త‌ప్ప‌క ఒప్పుకోవాల్సిన విష‌య‌మే. లోక‌ల్ నాన్‌లోక‌ల్ ఇష్యూనా.. డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాడా? అన్న విష‌యాలు ప‌క్క‌న‌బెడితే..ఓట‌ర్ల‌ను ఆకర్షించ‌డంతో ప్ర‌కాశ్‌రాజ్‌పై పైచేయి సాధించాడు. ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ జాకీర్ ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ అందించారు. ఈ క్ర‌మంలో గ‌తంలో మోహ‌న్‌బాబు టీవీ9 స్టూడియోకి వెళ్లి ర‌వి ప్ర‌కాశ్‌ని బెదిరించిన విష‌యాల‌ను పంచుకున్నారు.

  తాను టీవీ9లో ప‌నిచేస్తున్న టైంలో మోహ‌న్‌బాబు ఫ్యామిలీకి సంబంధించి ఇష్యూ జ‌రిగితే అది టీవీ9లో వార్తా వ‌చ్చింది. వెంట‌నే మోహ‌న్‌బాబు డైరెక్ట్‌గా తుపాకీ తీసుకుని టీవీ9 ఆఫీస్‌కి వ‌చ్చేశాడు. ర‌వి ప్ర‌కాశ్ ఎక్క‌డ‌? కాల్చిప‌డేస్తాను అంటూ బెదిరించారు. నిజానికి ఆ వార్తా త‌ప్పు అయిన‌ప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి ఖండించ‌వ‌చ్చు లేదంటే సీఈవో, ఛైర్మ‌న్‌ల‌తో మాట్లాడండి. లేదంటే కోర్టుకి వెళ్లి ప‌రువున‌ష్టం దావా వేయొచ్చు. ఇవేమీ చేయ‌కుండా డైరెక్ట్‌గా గ‌న్ ప‌ట్టుకుని టీవీ ఛానెల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి కాల్చిప‌డేస్తా అంటే ఏమ‌ని అనుకోవాలి.

  మోహ‌న్‌బాబుకి కోపం ఎక్కువ అని విష్ణు ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో మంత్రి త‌ల‌సాని కూడా అన్నారు. ఆ కోపం తీవ్ర‌త ఎంత అన్న‌ది నేను టీవీ9లో ఉన్నపుడు చూశాను అంటూ జ‌ర్న‌లిస్ట్ జాకీర్ కీల‌క‌మైన విష‌యాలు వెల్ల‌డించారు. ఇక‌ ప్ర‌కాశ్‌రాజ్ ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే నేను చాలా గొప్ప అని త‌న గురించి తాను ఎక్కువ ఊహించుకున్నాడు. గొప్ప‌న‌టుడ్ని కాబ‌ట్టి మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో నిల‌బ‌డితే ఓట్లు వేసేస్తారు అనుకున్నాడు. పోల్ మేనేజ్‌మెంట్ చేయ‌కుండా ప్ర‌కాశ్‌రాజ్ ఏం చేయ‌గ‌ల‌డు. ప్ర‌కాశ్‌రాజ్ వెనుక మెగాఫ్యామిలీ ఉంద‌ని చాలా ధీమాగా ఉన్నాడు.

  చిరంజీవి ఒక వ్య‌క్తిని ప్రెసిడెంట్‌గా అనౌన్స్ చేస్తే ఖ‌చ్చితంగా గెలుస్తాడ‌నే విశ్వాసం వాళ్ల‌లో ఎక్కువైపోయింది. అంతా మ‌న‌వాళ్లే క‌దా అని గుడ్డిగా ముందుకు వెళ్లారు.. అదే త‌న ఓట‌మికి కార‌ణాలు అయ్యాయి అని జాకీర్ తెలిపారు. ఇక మోహన్ బాబు విషయానికి వస్తే.. ఎన్నికల రోజున తిట్టారని కొట్టారని ప్రెస్ మీట్‌లో చాలామంది ఏడ్చారు. నిజానికి లోపల జరిగింది వేరే.. బయటకు వచ్చి వీళ్లు మాట్లాడింది వేరే.. నిజంగానే లోపల అంత పెద్ద గొడవ జరిగినప్పుడు ఆరోజే బయటకు వచ్చి విషయం చెప్తే సరిపోయేది. కానీ ఆరోజు వాళ్లంతా మోహన్ బాబుకి భయపడ్డారు. అవకాశం ఉన్నప్పుడు ప్రతిఘటించాల్సింది. అవసరం అయితే పోలింగ్ నిలిపివేయమని చెప్పినా తప్పులేదు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here