కాజల్ అగర్వాల్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 16ఏళ్ల కెరీర్లో ఎన్నో సినిమాలు, తెలుగుతో పాటు తమిళ్, హిందీ పలు భాషలో స్టార్ హీరోలందరితో పాటు నటించిన ఆమె సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అందంతో పాటు అభినయంతో సినీ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకుంది.
కాగా కాజల్ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నపుడే తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి తర్వాత కూడా సినిమాలు ఆపలేదు. అంతే హుషారుగా మరిన్ని అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఇదిలా ఉంటే ఇటీవల అందాల భామ కాజల్ గర్భవతి అయిందని వార్తాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తాలు రూమర్స్ మాత్రమే తెలుస్తోంది.
కాజల్ తాజాగా చీరలో ఫోటోషూట్ చేసుకుంది. ఈ ఫోటోల్లో కాజల్ నాజూగ్గా ఎంతో అందంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను చూస్తే కాజల్ ప్రెగ్నెంట్ కాలేదని తెలుస్తోంది.. కాబట్టి ఇది ఫేక్ వార్తా. ప్రస్తుతం కాజల్ ఉమ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ అయిందని పోస్ట్ కూడా పెట్టింది కాజల్.
ఈ చిత్రానికి దర్శకుడు తథాగత సింఘా కాగా, హర్ష్ ఛాయ, మేఘన మాలిక్, టిన్ను ఆనంద్, గౌరవ్ శర్మ, అయోషి తాలూక్దర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ఘోస్ట్ చిత్రంలో నాగార్జునకు జోడీగా నటిస్తుంది కాజల్.
ఇక ఆమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో హీరోయిన్ చేస్తుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.