ప‌వ‌న్‌, విష్ణు ఇద్ద‌రు చాలాసేపు మాట్లాడుకున్నారు: మంచు ల‌క్ష్మీ

  264
  0
  power

  హర్యాణా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ నేతృత్వంలో ద‌త్త‌న్న ఆల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. జ‌ల విహార్‌లో అల‌య్ బ‌ల‌య్ సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప్రారంభించారు. ఈ కార్య‌క్రమానికి ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీ‌నివాస‌రావు, మా అధ్య‌క్షుడు మంచు విష్ణు త‌దిత‌రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

  అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ప‌లువురు ప్ర‌ముఖుల మ‌ధ్య దూరాన్ని పెంచాయ‌నే మాటలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీల రిలేష‌న్‌షిప్ దూరం పెరిగింద‌ని టాలీవుడ్‌లో న‌డుస్తుంది. అల‌య్ బ‌ల‌య్ ప్రోగ్రాంలో పాల్గొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంచు విష్ణు ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్నారు.. కానీ ప‌వ‌న్‌తో మాట్లాడేందుకు మంచు విష్ణు ప్ర‌య‌త్నించేలోపే అక్క‌డ నుంచి ప‌వ‌న్ ప‌క్క‌కు వెళ్లారు..

  కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప‌లుక‌రించేందుకు మంచు విష్ణు ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ క్ర‌మంలో ఆ వేదిక నుంచి మంచు విష్ణు ఒక వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. చివ‌ర ఉన్న వ్య‌క్తి ఎవ‌రో గుర్తించండి అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. దీంతో సోష‌ల్ మీడియాలో.. మంచు మ‌నోజ్ భీమ్లానాయ‌క్ సెట్స్‌కు వ‌చ్చి ప‌వ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశాడు, ఈడీ ముందు గ‌డ్డిపోస‌, పెద్ద‌వాళ్ల‌ను గౌరవించే విధానం ఇదేనా మంచు విష్ణు గారు, ఆ రోజు మెగా స్టార్ చిరంజీవి ఓటు వేయ‌డానికి వ‌చ్చిన‌పుడు చిరు దగ్గ‌ర ఏవిధంగా ప్ర‌వ‌ర్తించావు అని నెటిజ‌న్స్‌ కామెంట్స్ పెడుతున్నారు.

  మ‌రోవైపు దీనిపై మంచు ల‌క్ష్మీ స్పందిస్తూ.. ద‌త్త‌న అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు, త‌న త‌మ్ముడు మంచు విష్ణు ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉండ‌లేదు. ఇద్ద‌రూ చాలా సేపు మాట్లాడుకున్నార‌ని తెలిపారు. అలాగే ప‌వ‌న్‌, విష్ణు ఉన్న ఒక ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో ఏవేవో ఇష్టం వ‌చ్చిన‌ట్లు అల్లేస్తున్నారంటూ మంచు ల‌క్ష్మీ మండిప‌డ్డారు. మాలో మాకు విబేధాలు లేవు.. మేమంతా ఒక‌టే అంటూ మంచు ల‌క్ష్మీ స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చింది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here