నేడు టీఆర్ఎస్ భ‌వ‌న్‌లో కీల‌క‌భేటి.. హాజ‌రుకానున్న సీఎం కేసీఆర్‌!

  253
  0
  cm kcr

  ఈ నెల 25న టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో చ‌ర్య‌కు రానున్న అంశాల‌పై తెలంగాణ భ‌వ‌న్‌లో ఆదివారం స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజ‌ర‌వుతున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఈ స‌మావేశంలో పాల్గొనున్నార‌ని పార్టీ వ‌ర్గాల నుంచి స‌మాచారం. కానీ నిర్దిష్ట షెడ్యూలులో మాత్రం కేసీఆర్ హాజ‌రు కావ‌డంపై అధికారికంగా పార్టీ వ‌ర్గాలు ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

  కేవ‌లం ప్లీన‌రీలో చ‌ర్చించాల్సిన అంశాలు మాత్ర‌మే కాక వచ్చే నెల 15న వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించ‌నున్న విజ‌య‌గ‌ర్జ‌న, పార్టీ జిల్లా క‌మిటీల కూర్పు, నామినేట్ పోస్టులు, తాజా రాజ‌కీయ ప‌రిస్థితులు, జాతీయ ప‌రిణామాలు, త‌దిత‌ర అంశాల‌పై ఈ స‌మావేశంలో కేటీఆర్ చ‌ర్చించే అవ‌కాశం ఉంది. స‌న్నాహ‌క స‌మావేశానికి ముందే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ‌నివాస‌రెడ్డి ప్లీన‌రీకి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాల‌ను మీడియాకు వివ‌రించ‌నున్నారు.

  పార్టీకి కొత్త అధ్య‌క్షుడి ఎన్నిక ప్లీన‌రీ సంద‌ర్భంగా ఉంటున్నందున నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే పార్టీ ప్ర‌చారం ఉధృత‌మైంది. సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించే విష‌య‌మై పార్టీలో చ‌ర్చ జ‌రుగుతున్నా.. ఇంకా స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం వెలువ‌డ‌లేదు. తేదీలు కూడా ఖ‌రారు కాలేదు. ఎలాగూ ప్లీన‌రీలో హుజూరాబాద్ ఫోక‌స్‌గా కేసీఆర్ కొన్ని కీల‌క కామెంట్స్‌, వ్యాఖ్యానాలు చేయ‌నున్నందున ప్ర‌త్యేకంగా బ‌హిరంగ స‌భ ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న వాద‌న కూడా వినిపిస్తున్న‌ది.

  ప్లీన‌రీ స‌న్నాహ‌క స‌మావేశం నుంచి వ‌చ్చే నెల 15న వ‌రంగ‌ల్‌లో విజ‌య గ‌ర్జ‌న జ‌రిగేంత వ‌ర‌కు పార్టీకి సంబంధించిన ప‌లు ర‌కాల కార్య‌క్ర‌మాలు ఉన్నాయి. వాటిన్నింటిపై నిర్దిష్ట కార్యాచ‌ర‌ణ‌, వ‌ర్క్ డివిజ‌న్‌, బాధ్య‌త‌ల అప్ప‌గింత త‌దిత‌రాల‌పై కేసీఆర్ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చే అవ‌కాశం ఉంది. పార్టీకి ప్ర‌స్తుతం కేటీఆర్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ దాదాపుగా అధ్య‌క్షుడిగా కేసీఆర్ చేప‌ట్టాల్సిన పనుల‌న్నింటినీ చేస్తున్నారు. ప్లీన‌రీ సంద‌ర్భంగా కేటీఆర్‌ను యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా ప్ర‌క‌టించే అవ‌కాశం లేక‌పోలేద‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here