అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించగా.. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం తొలి రోజు నుంచి మంచి టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ వచ్చాయని టాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్‌కు సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ..
ముందుగా ఈ చిత్రంను ఆదరించిన ప్రేక్షకాభిమానులకు ధన్యవాదాలు. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది. ఈ క్రమంలో చిలిపి సంఘటన గుర్తుచేసుకుంటూ.. అమ్మకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నాన్న అమెరికాలో టెస్టులు చేయించారు. అక్కడి డాక్టర్లు అమ్మాయి పుడుతుందని చెప్పగానే నాన్న ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. దీంతో ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే లేడీస్‌కు సంబంధించిన డ్రెస్‌లు కొనేశారు. అలాగే అమ్మాయికి నికిత అనే పేరు కూడా పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు.
కానీ డెలివరీ రూమ్‌లో పుట్టింది అబ్బాయి అని తెలిసింది. అప్పుడు మా నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యారట. అలా అమ్మాయి పుడుతుందని నాన్న అనుకుంటే నేను పుట్టాను. ఇప్పటికీ మా నాన్న తన సన్నిహితుల దగ్గర ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ పడి పడి నవ్వుతూనే ఉంటారు.. నాక్కూడా ఎంతో తమాషాగా అనిపిస్తూ ఉంటుందని అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదిలా ఉంటే.. ప్రముఖ డైరెక్టర్ సురేందర్రెడ్డ దర్శకత్వంలో ఏజెంట్ అనే చిత్రంలో అఖిల్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.