క‌ల్మ‌శం లేని బంగారు మ‌న‌సున్న వ్య‌క్తి మా బాల‌య్య‌: రోజా

  267
  0
  roja balakrishna

  జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాంకు తాను జ‌డ్జీగా వ‌స్తాన‌ని నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ.. న‌టీ రోజాతో ఫోన్ సంభాష‌ణ‌లో తెలిపాడు. వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాం రోజా, సింగ‌ర్ మ‌నో జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్‌పై నుంచి బాల‌య్య‌కు రోజా ఫోన్ చేసింది.. దీంతో జ‌బ‌ర్ద‌స్ట్ యాంక‌ర్ అన‌సూయ‌, హైప‌ర్ ఆది, అదిరే అభి త‌దిత‌ర న‌టులంతా ఎంతో సంబ‌ర‌ప‌డిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ల‌కి గూస్‌బంప్స్ వ‌చ్చాయి.

  బాల‌కృష్ణ‌-రోజా ఆ ఫోన్ సంభాష‌ణ ఎలా ఉందంటే.. హాలో బాల‌కృష్ణ గారు బాగున్నారా? హా రోజా గారు న‌మ‌ష్కారం బాగున్నా మీరు ఎలా ఉన్నారు అని బాల‌య్య అడ‌గ్గా… దీనికి హా బాగున్నాను ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాంలో ఉన్నాను మీరు ఎక్క‌డా ఉన్నారు అని రోజు చెపుతూ… హా నేనా అఖండ మూవీ మ‌న అఖండ షూట్‌లో ఉన్నాన‌ని బ‌దులిచ్చారు బాల‌య్య‌.

  అలాగే మ‌ళ్లీ మ‌నిద్ద‌రం క‌లిసి ఎప్పుడు సినిమా చేద్దాము.. భైర‌వ‌ద్వీపం పార్ట్‌2 చేద్దామా? లేక బొబ్బిలిసింహం పార్ట్‌2 చేద్దామా? అని రోజా బాలయ్య‌ను ప్ర‌శ్నించగా బాల‌కృష్ణ చెబుతూ.. జ‌బ‌ర్ద‌స్ట్ ప్రోగ్రాం కు జ‌డ్జీగా వ‌స్తాన‌ని తెలిపారు. దీంతో అక్క‌డ ఉన్న‌వారంతా ఖుష్ ఖుష్ అయ్యారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి బాల‌కృష్ణ అభిమానుల నుంచి.. క‌ల్మ‌శం లేని బంగారు మ‌న‌స్సు ఉన్న వ్య‌క్తి మా బాల‌య్య జై బాల‌య్య అని కామెంట్స్ చేస్తున్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here