Home Entertainment బాయ్‌ఫ్రెండ్‌ను దాచిపెట్టిన ప్రియాంక‌

బాయ్‌ఫ్రెండ్‌ను దాచిపెట్టిన ప్రియాంక‌

315
0

మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది గ్లోబల్‌స్టార్‌ ప్రియాంకచోప్రా. వ్యక్తిగత విషయాల్లో సైతం ఏమాత్రం గోప్యత పాటించడానికి ఇష్టపడదు. ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నచ్చిన విధంగా జీవితాన్ని సాగించడమే తన నైజమని చెబుతుంటుంది. తన సినీ ప్రయాణానికి అక్షరరూపమిస్తూ ప్రియాంక చోప్రా ‘అన్‌ ఫినిష్డ్‌’ పేరుతో ఓ పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె పాఠశాల నాటి ప్రేమ ముచ్చట్లను వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ముంబయిలో పదోతరగతి చదువుతున్నప్పుడే తాను బాబ్‌ అనే అబ్బాయితో ప్రేమలో పడ్డానని, అతనిలోని హాస్యచతురత తనను ఆకట్టుకుందని ప్రియాంకచోప్రా చెప్పింది. ఈ సందర్భంగా అతనితో జరిగిన ఓ సరదా సంఘటన గురించి చెప్పింది. ‘ఓ రోజు ఆ అబ్బాయితో కలిసి ఇంట్లో టీవీ చూస్తుండగా ఒక్కసారిగా మా అత్తమ్మ లోనికి వచ్చింది. ఏం చేయాలో తోచక అతన్ని బీరువాలో దాచిపెట్టాను. అయితే అత్తయ్య అనుమానంతో ఇల్లంతా వెతికి ఆ అబ్బాయిని పట్టుకొని మందలించింది. ఈ సంఘటనను గుర్తుతెచ్చుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది’ అని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here