Home Entertainment త‌న భ‌ర్త వ‌ల్ల శిల్పా శెట్టి ఎంత న‌ష్ట‌పోయిందో తెలుసా?

త‌న భ‌ర్త వ‌ల్ల శిల్పా శెట్టి ఎంత న‌ష్ట‌పోయిందో తెలుసా?

373
0

ముంబై పోలీసులు ఎప్పుడైతే రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేశారో.. అప్పటి నుంచి శిల్పా ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. ఆమె పాల్గొనాల్సిన పలు షోల షూటింగ్స్‌ని కూడా రద్దు చేసుకుంది. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ డ్యాన్స్‌ షోకి శిల్పా జడ్జిగా వ్యవహరిస్తుంది. ఈ షో ఒక్కో ఎపిసోడ్‌కి శిల్పా రూ.18 నుంచి 22 లక్షల వరకు పారితోషికంగా పుచ్చుకుంటుందట. అయితే భర్త అరెస్ట్‌ అయినప్పటి నుంచి ఆమె ఈ షో షూటింగ్‌కి వెళ్లడం లేదు. దీంతో ఇప్పటి వరకు శిల్పాశెట్టి దాదాపు రూ.2 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది.

మరోవైపు షో షూటింగ్‌కి శిల్పా డుమ్మా కొట్టడంతో ఆమె స్థానంలో ఒక ఎపిసోడ్‌కి కరిష్మా కపూర్‌ని తీసుకొచ్చారు నిర్వాహకులు. ఆ తర్వాత జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ లను తీసుకొచ్చారు. అయితే వీరంతా ఒక్కో ఎపిసోడ్ లో కనిపించి వెళ్లిపోయారు. ఇలా గెస్ట్‌లతో ఈ షోని ఎక్కువ రోజులు నడిపించలేరు. మరోవైపు ఇప్పట్లో రాజ్‌కుంద్రా కేసు ఓ కొలిక్కి వచ్చేలా లేదు. దీంతో ఈ డ్యాన్స్‌ షోలో శిల్పాశెట్టిని ఉంచాలా? వద్దా? అనే విషయంపై నిర్వాహకులు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here