మన హీరోయిన్లు చాలా మారిపోయారు. ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ కు ఆమడ దూరంలో ఉండే ఈ బ్యూటీలు.. ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో ఆ పనికి పూనుకుంటున్నారు. ఆప్పుడేమో స్పెషల్ సాంగ్స్ చేస్తే.. మెయిన్ రోల్స్ మిస్ అవుతాయని భావించిన ఈ బ్యూటీలు ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో ఐటం పాపలుగా మారిపోతున్నారు. అరకొర అందాలను చూపిస్తూ కుర్రకారును హుషారెక్కించే పనిలో పడ్డారు.
ముఖ్యంగా తమన్న తమన్నా 30సంవత్సరాల వయసు దాటాకా.. సినిమా ఛాన్స్ లు తగ్గిపోయాయి. ఇంకేముందీ ఐటం పాపగా మారిపోయింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు’ లాంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసిన మిల్కీ, ఇప్పుడు వరుణ్‌తేజ్ ‘గని’లో కూడా మరో సాంగ్ చేేసేందుకు సిద్ధమైంది. ఒక్కసాంగ్ కు దాదాపు 50లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం. సన్నీ లియోన్ హీరోయిన్ గా పెద్ద రాణించలేదు. కానీ స్క్రీన్ పై ఈమె అందాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. అందుకే ఈ ఒక్క విషయం కోసం సినీ ఇండస్ట్రీ వాళ్లు సన్నీ వెంటపడతారు. ఐటెమ్ సాంగ్స్ కే పరిమితం చేస్తారు. ఇప్పటికే గరుడవేగ, కరెంట్ తీగ’ లాంటి సినిమాల్లో మెరిసిన సన్నీ తాజాగా అల్లు అర్జున్ ‘పుష్ప’లో కూడా స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఒక్క పాటకు కోటి రూపాయల దాకా తీసుకుంటుందని సమాచారం.
ఇక కలువకళ్ల సుందరి కాజల్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అవకాశాలు తగ్గిపోయాయి. సీనియర్లతో వచ్చే అరకొర సినిమాలతోనే సర్దుకుంటుంది. ‘సలార్’లో కాజల్ ఒక ఐటమ్ సాంగ్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇక చందమామ కెరీర్లో చేసిన ఒకే ఒక్క ఐటెమ్ సాంగ్‌కి 50 లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం.
ఇక పూజా హెగ్డే విషయానికొస్తే.. తెలుగుతో పాటు, హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తోంది. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్‌తో స్టెప్పులేస్తూ బీటౌన్ స్టార్ హీరోయిన్గా మారుతోంది. ఇక ఈ బ్యూటీ కూడా ఐటెమ్ సాంగ్ చేసింది. ‘రంగస్థలం’లో జిగేలురాణిగా మాస్ స్టెప్పులేసింది. ఇక ఈ సాంగ్‌కి పూజా 50 లక్షలు తీసుకుందట.
‘ఆర్.ఎక్స్.100’తో గ్లామర్ బాంబ్స్ పేల్చిన పాయల్ రాజ్‌పుత్ కూడా ఐటెమ్ సాంగ్స్‌ని క్యాష్ చేసుకుంది. డెబ్యూతోనే బోల్డ్ బ్యూటీ అనే ఇమేజ్ కూడా వచ్చింది కాబట్టి, స్పెషల్ సాంగ్స్ ఆఫర్ చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇక ‘సీత’ సినిమాలో బుల్లెట్ సాంగ్‌కి స్టెప్పులేసిన పాయల్ భారీగా చార్జ్ చేసిందని సమాచారం.