చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీరంగ ప్రవేశం చేసిన ఈ కుర్రాడు.. ఇప్పుడు టాప్ హీరో. ప్రస్తుతం ఈ చిన్నారి.. ఇప్పుడు వరుస సినిమాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తూ ఆల్ టైం బిజీగా గడిపేస్తున్నాడు.
ఫోటోలో ఉన్న క్యూట్ బాయ్ అసలు పేరు నందమూరి తారక రామ రావు. అందరూ అతడిని జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తుంటారు. ఇప్పటికైనా గుర్తుపట్టారా. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు.