వచ్చేవారానికి సంబంధించి ‘జబర్దస్త్’ ప్రోమో విడుదల కాగా.. ఇందులో రొటీన్ రోత పద్దతిలో రష్మి-సుధీర్లను మరోసారి పెళ్లి పీటలు ఎక్కించేశారు. వీళ్లతో పాటు హైపర్ ఆది-దీపిక పిల్లిని కూడా పెళ్లి జంటగా మార్చేయడంతో మల్లెమాలను ఓ రేంజ్లో ఏకిపారేస్తున్నారు నెటిజన్లు.
ఇక మిగతా ప్రోమో విషయానికి వస్తే.. పెళ్లి రష్మి ఫోకస్ అవుతుంది మరి నేనేం కావాలని అనుకుందో ఏమో కానీ అనసూయ కూడా నోటికి పనిచెప్పింది. డబుల్ మీనింగ్ డైలాగ్లతో రెచ్చిపోయింది.
గుర్రానికి ముందు.. ఏనుగుకి చివర ఉండేది ఏంటి అన్నా.. అంటే!! ఠక్కుమని ‘గు’ అని సమాధానం ఇచ్చి ఆ తరువాత అందులోని డబుల్ మీనింగ్ని గ్రహించి నాలుక కరుచుకుంది అనసూయ. ఆమె గు.. అని అనగానే ‘ఏం మాట్లాడుతున్నావ్ అనూ’ అంటూ అదిరే అభి మరింతగా యాక్ట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో అనసూయ ముఖానికి అడ్డంగా చేతులు పెట్టుకుని తెగ సిగ్గుపడిపోయింది. అనేశాక ముఖం ఎందుకు దాచుకోవడం.. సిగ్గుపడటం.. అయినా ఇలాంటి సిగ్గులేని మాటలు వీళ్లకేం కొత్తేం కాదుగా అని నెటిజన్లు కామెంట్లతో ఏకేస్తున్నారు. నిజానికి లాజిక్ ప్రకారం ‘గు’ ర్రానికి ముందు.. ఏను‘గు’ చివర ఉండేది ‘గు’ నే.. అయితే వీళ్లు మాత్రం ఓవరాక్టింగ్తో అందులోని డబుల్ మీనింగ్ని హైలైట్ చేశారు.