ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి కొత్త చిక్కు వచ్చి పడింది. ఈ సినిమాని ఆపాలంటూ స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞాన్ వేల్ రాజా లీగల్ గా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. లింగుస్వామికి, జ్ఞాన్ వేల్ రాజాకు మధ్య సినిమాల పరంగా కొన్ని ఆర్థిక లావాదేవీలు పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తోంది.
ఆ లెక్కలు తేలేవరకు లింకుస్వామి మరో సినిమా చేయకుండా చూడాలని తెలుగు నిర్మాతల మండలిలో జ్ఞాన్వేల్ తాజగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జ్ఞాన్ వేల్ రాజా మాట్లాడుతూ.. ‘మా బ్యానర్ లో దర్శకుడు లింగుస్వామి ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ మా సినిమాని పక్కనపెట్టి రామ్ తో సినిమా చేయడానికి లింగుస్వామి రెడీ అయ్యారు. ఇది కరెక్టు కాదు, మాట ప్రకారం ముందు ఆయన మా బ్యానర్ లోనే సినిమా చేయాలి’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.