Home Entertainment బ‌య‌టేకాదూ మ‌న‌సూ అంద‌మే

బ‌య‌టేకాదూ మ‌న‌సూ అంద‌మే

424
0

కొవిడ్ మొదటి దశ మొదలైన దగ్గర్నుంచి పలు మార్లు పలు విధాలుగా ఆమె సహాయం అందించారు. గతేడాది లాక్ డౌన్ సమయంలోనూ తనవంతుగా కొవిడ్ బాధితులకు సహకారం అందించారు ప్రణీత. చాలా మందికి ఆహారం సరఫరా చేశారు. సెకండ్ వేవ్ లో ఆహారం కన్నా.. ఆక్సీజన్ ఎక్కువ అవసరమైందని తన చారిటీ ద్వారా ఆక్సీజన్ సిలిండర్లు కాన్సన్ట్రేటర్లు అందించారు.

ఇప్పుడు మరో విధంగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కొవిడ్ ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ ఎంతో కీలకం అన్న సంగతి తెలిసిందే. కానీ.. దేశంలో చాలా మంది వ్యాక్సిన్ అందక నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు ప్రణీత.

ఇవాళ బెంగళూరులో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత వ్యాక్సిన్ అందుబాటులో ఉందని ఈ మేరకు తన ఫౌండేషన్ ద్వారా ఏర్పాట్లు చేశామని ప్రణీత వెల్లడించారు. అస్టర్ అనే ఆసుపత్రిలో ఉచితంగా వ్యాక్సిన్ తీసుకోవొచ్చని సమీపంలో ఉన్నవారు వెళ్లి తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

దీంతో.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీది అందమైన రూపమే కాదు.. అంతకు మించి అందమైన మనసు కూడా.. అంటూ అభినందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here