Tollywood Heroes Education: టాలీవుడ్లో హీరోలు చాలా మంది మంచి చదువులు చదివారు. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాతే సినిమాల్లోకి వచ్చారు. వెంకటేష్(Venkatesh), నాగార్జున(Nagarjuna), గోపీచంద్(Gopichand) లాంటి వాళ్లు మాత్రం ఏకంగా ఫారెన్‌లో చదువుకుని వచ్చి ఇక్కడ హీరోలుగా సెటిల్ అయిపోయారు. మన ఇండస్ట్రీలో అత్యధికంగా చదువుకున్న హీరోలెవరు.. చదువు అబ్బని కథానాయకులు ఎవరో చూద్దాం..
టాలీవుడ్లో హీరోలు చాలా మంది మంచి చదువులు చదివారు. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాతే సినిమాల్లోకి వచ్చారు. మరికొందరు మాత్రం చదువును మధ్యలోనే ఆపేసి.. హీరోలుగా మారిపోయారు. వారసత్వం పునికి పుచ్చుకుని చదువు కూడా పూర్తి కాకుండానే సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు స్టార్స్ అయ్యారు. అయితే వెంకటేష్, నాగార్జున, గోపీచంద్ లాంటి వాళ్లు మాత్రం ఏకంగా ఫారెన్‌లో చదువుకుని వచ్చి ఇక్కడ హీరోలుగా సెటిల్ అయిపోయారు. స్టార్స్‌గా ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. మరి మన ఇండస్ట్రీలో అత్యధికంగా చదువుకున్న హీరోలెవరు.. చదువు అబ్బని కథానాయకులు ఎవరో చూద్దాం..
చిరంజీవి: డిగ్రీ ఇన్ కామర్స్ (YN కాలేజ్, నర్సాపూర్)
జూనియర్ ఎన్టీఆర్: ఇంటర్మీడియట్ (సెయింట్ మేరీస్ కాలేజ్, హైదరాబాద్)
పవన్ కళ్యాణ్: ఇంటర్మీడియట్
వెంకటేష్: MBA- మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (మోంటేరే ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, అమెరికా)
నాగార్జున: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ (ఈస్టర్న్ మిచిగాన్ యూనివర్సిటీ, అమెరికా)
బాలకృష్ణ నందమూరి: డిగ్రీ (నిజాం కాలేజ్)
అల్లు అర్జున్: బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎమ్మెస్ఆర్ కాలేజ్, హైదరాబాద్)
మహేష్ బాబు: హానర్స్ డిగ్రీ ఆఫ్ కామర్స్ (లయోలా కాలేజ్, చెన్నై)
ప్రభాస్: బి టెక్
నితిన్: బి టెక్
రామ్ చరణ్: లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్
రవితేజ: బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ (సిద్ధార్థ్ కాలేజ్, విజయవాడ)
రానా దగ్గుబాటి: బ్యారీ జాన్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్
గోపీచంద్: రష్యాలో ఇంజనీరింగ్
అఖిల్ అక్కినేని: థియేటర్ ఆర్ట్స్, ది లీ స్టార్ట్స్ బర్గ్ థియేటర్ వెస్ట్ హాలీవుడ్
నాగ చైతన్య: బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్
సిద్ధార్థ్: బి కామ్
అల్లరి నరేష్: బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఫారెన్ ట్రేడ్
కళ్యాణ్ రామ్: చికాగోలో MS
రాజశేఖర్: MBBS
నాని: డిగ్రీ (వేస్లీ డిగ్రీ కాలేజ్)
విజయ్ దేవరకొండ: బి కామ్
రామ్ పోతినేని: డిగ్రీ
శర్వానంద్: బి కామ్ (వేస్లీ డిగ్రీ కాలేజ్)
సుధీర్ బాబు: BE, GMT, MBA