ఈ వారం ప్రారంభంలో బాలీవుడ్ స్టార్లు అభిషేక్ బచ్చన్.. విద్యాబాలన్ .. విక్కీ కౌషల్ వంటి స్టార్లతో డబూ వరస ఫోటో షూట్లు చేశారు. ఆ ఫోటోలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఆదివారం.. సన్నీ లియోన్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటోని పంచుకోవడం ద్వారా క్లబ్ లో చేరారు. ఈ ఫోటోలో సన్నీ.. భారీ టోపీ.. స్టిలెట్టోస్ తప్ప ఒంటిపై నూలుపోగైనా లేకుండా పోజులిచ్చింది.
అసలు మేకప్ తో పని లేకుండా ఒక స్థంబానికి ఆనుకుని కెమెరాకు పోజు ఇచ్చింది. `వేసవి ఇక్కడ ఉంది !!“ అనే క్యాప్షన్ తో సన్నీ ఈ ఫోటోని షేర్ చేయగా వైరల్ గా మారింది. డబూ కూడా ఈ ఫోటోని సోషల్ మీడియాల్లో పంచుకున్నారు. డబూరత్నాని కేలెండర్ # 2021 కోసం ఫోజులివి. సన్ షైన్ కోసమే అయినా పెద్ద టోపీ అవసరం అని ఆయన చిలిపి వ్యాఖ్యను జోడించారు. సన్నీలియోన్ కెరీర్ పరంగా వెబ్ సిరీస్ లు సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ సంస్థలోనూ నటిస్తోంది.