Home Entertainment కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీజేపీ అనడంలో మర్మం ఏంటి?

కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీజేపీ అనడంలో మర్మం ఏంటి?

223
0

జీహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ దగ్గర పడే కొద్దీ నేతల మాటల హోరు పెరుగుతుంది. ఈరోజు ప్రచారం సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. “తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి. జీహెచ్ఎంసి ఎన్నికల తరువాత అవినీతి ప్రభుత్వం కూలుతుంది. కేంద్రం అన్ని లెక్కలు తేల్చుతుంది.అమిత్ షా వస్తున్నాడు… టిఆర్ఎస్ జాగ్రత్త,” అంటూ హెచ్చరించారు.

నిన్న బీజేపీకే చెందిన మరో ఎంపీ కూడా ఇదే విధంగా ఆరు నెలలో తెరాస సర్కారు కూలుతుందని వ్యాఖ్యానించారు. దీనితో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయ్యడానికి బీజేపీ ఏదన్నా ప్లాన్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి కేవలం రెండు సీట్లు ఉన్నాయి. తెరాసకు 88 సీట్లు రాగా వేరే పార్టీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి చేరారు.

అటువంటి సర్కారుని కూల్చడం అంటే సంచలనమే. అయితే జీహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా జీహెచ్ఎంసి లో బీజేపీ గెలిచినా ఉపయోగం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఏమీ చెయ్యలేరని కావున వారికి ఓటు వేస్తే ఉపయోగం లేదని తెరాస వారు ఒక వాదన తెరమీదకు తెస్తున్నారు.

ఈ తరుణంలో తెరాస ప్రభుత్వాన్ని కూలదోస్తాం… రెండు చోట్లా మేమే అధికారంలో ఉంటాం కాబట్టి జీహెచ్ఎంసీ లో మాకు ఓట్లు వెయ్యండి అంటూ ఈ వాదన తెరమీదకు తెస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాన్ని కూలుస్తాము అనే హెచ్చరికలు సమంజసం కూడా కాదు… ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయ్యడం అంటే అదే ప్రజలను అవహేళన చెయ్యడమే. అటువంటి వాటికి ప్రజల మద్దతు కూడా ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here