కాంట్రవర్సీలను సినిమాలను తెరక్కించడంలో రాంగోపాల్ వర్మను మించిన దర్శకుడు ఇండస్ట్రీలో లేరనే చెప్పొచ్చు. ఎంతటి కాంట్రవర్సీ ఇష్యూనైనా ఆయన సినిమాగా తెరకెక్కించి ఫ్రీ పబ్లిసిటీతో క్యాష్ చేసుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. వర్మపై ఎవరెన్నీ విమర్శలు చేసిన తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.
కరోనా సమయంలో ఇండస్ట్రీలోని దర్శకులు.. నిర్మాతలు.. హీరోలంతా ఇంటికే పరిమితమైతే వర్మ మాత్రం వరుస సినిమాలతో బీజీగా మారాడు. కరోనా సమయంలో వర్మ చేసినన్నీ సినిమాలను ఏ దర్శకుడు చేయలేదు. ఆ పరంపరను ఆయన కొనసాగిస్తూ పోతున్నారు. ఇటీవల ‘నగ్నం’.. ‘క్లైమాక్స్’ మూవీలతో అలరించిన రాంగోపాల్ వర్మ తాజాగా ‘డేంజరస్’ మూవీతో రాబోతున్నాడు.
ఇండియాలోనే తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ మూవీగా ‘డేంజరస్’ రాబోతుందని వర్మ గతంలోనే ప్రకటించాడు. ఈ రొమాంటిక్ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. తాజాగా రాంగోపాల్ వర్మ ‘డేంజరస్’ మూవీ విశేషాలను తెలియజేస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాడు. ఈ మూవీలో ఇద్దరు హాట్ భామలు నైనా గంగూలీ.. అప్సరరాణిలు లెస్బియన్లుగా నటిస్తున్నారు. కాకపుట్టించే ఫార్మమెన్స్ తో వీరిద్దరు ఆకట్టుకోవడం ఖాయంగా కన్పిస్తోంది.
రాంగోపాల్ వర్మ షూటింగు లోకేషన్లలో అందమైన హీరోయిన్లతో దిగిన ఫొటోలను షేర్ చేశాడు. గోవాలో కర్లీస్ అనే అందమైన ప్రదేశం ఉందని.. అక్కడే పలు డేంజరస్ షాట్స్ షూటింగ్ చేస్తూ ప్రతీ రాత్రి పార్టీలు చేసుకున్నామంటూ రాంగోపాల్ వర్మ ఓపెన్ అయ్యారు. నారి.. నారి.. నడుమ మురారి అన్నచందంగా రాంగోపాల్ షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఓపక్క నైనా గంగూలీ.. మధ్యలో వర్మ.. మరోపక్క అప్సరరాణి ఉండగా వీరిద్దరి ఒకేసారి గట్టిగా హాగ్ చేసుకున్నట్లు వర్మ నలిపేస్తున్నాడు. ఇది చూసిన నెటిజన్లంతా హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో వర్మ గోవాలో బాగానే ఎంజాయ్ చేసినట్లు ఉన్నాడే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ మూవీకి సంబంధించిన రొమాంటిక్ ఫొటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. సినిమాపై ఇప్పటికే అంచనాలు పెంచిన రాంగోపాల్ వర్మకు ‘డేంజరస్’ మూవీ ఎలాంటి కిక్కు ఇస్తుందో వేచిచూడాల్సిందే..!