Home Entertainment Dussehra Special Trains: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి దసరా స్పెషల్ ట్రైన్స్…. రూట్స్, టైమింగ్స్...

Dussehra Special Trains: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి దసరా స్పెషల్ ట్రైన్స్…. రూట్స్, టైమింగ్స్ ఇవే

371
0

Dussehra Special Trains | తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు శుభవార్త. నేటి నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది భారతీయ రైల్వే. దసరా, దీపావళి సందర్భంగా ఈ రైళ్లను నడుపుతోంది. కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల నుంచి వెళ్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నడిచే ప్రత్యేక రైళ్ల వివరాలు, రూట్స్, టైమింగ్స్ తెలుసుకోండి.

భారతీయ రైల్వే దసరా, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వేర్వేరు జోన్లలో 39 స్పెషల్ ట్రైన్స్ నడపుతోంది. వీటిలో ఏసీ ఎక్స్‌ప్రెస్, దురంతో, రాజధాని, శతాబ్ధి లాంటి రైళ్లు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

పండుగ సీజన్ సందర్భంగా 200 రైళ్లను నడుపుతామని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 39 రైళ్ల జాబితాను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)

రైలు నెంబర్ 02774 సికింద్రాబాద్ నుంచి షాలిమార్‌కు ప్రతీ మంగళవారం రైలు బయల్దేరుతుంది. అక్టోబర్ 13 నుంచి ఈ రైలు అందుబాటులోకి రానుంది. ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్‌లో రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. ఈ రైలు వరంగల్, రాయనపాడు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (Source: South Indian Railways)
రైలు నెంబర్ 02773 షాలిమార్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ బుధవారం రైలు బయల్దేరుతుంది. అక్టోబర్ 14 నుంచి ఈ రైలు అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 4.05 గంటలకు షాలిమార్‌లో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, రాయనపాడు, వరంగల్ రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
 రైలు నెంబర్ 02708 తిరుపతి నుంచి విశాఖపట్నం వారంలో మూడు రోజులు రైలు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 14 నుంచి ప్రతీ బుధవారం, శుక్రవారం, ఆదివారం రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో రైలు బయల్దేరుతుంది. మరుసటిరోజు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, న్యూ గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (Source: South Indian Railways)
రైలు నెంబర్ 02784 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ప్రతీ వారం ప్రత్యేక రైలు నడవనుంది. అక్టోబర్ 17 నుంచి ప్రతీ శనివారం సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్‌లో రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దారిలో గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వేస్టేషన్లలో రైలు ఆగుతుంది. (Source: South Indian Railways)
ఇక రైలు నెంబర్ 02783 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ వారం ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 18 నుంచి ప్రతీ ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు రైలు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here