దిశ మూవీ విషయంలో వర్మకు షాక్.. సినిమాను అడ్డుకోవాలని హైకోర్టులో దిశ తండ్రి పిటిషన్..

0
17

Ram Gopal Varma : ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంతో మందుండే రామ్ గోపాల్ వర్మ ‘దిశా’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని దిశ తండ్రి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు

Ram Gopal Varma : ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంతో మందుండే రామ్ గోపాల్ వర్మ ‘దిశా’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు వర్మ. ఆయన ఇప్పటికే పలు రాజకీయ, క్రైం అంశాలనీ వెండితెరపై చూపించాడు. 2019 నవంబర్‌లో హైదరాబాద్’లో జరిగిన దిశా అత్యాచార, హత్య సంఘటన నేపథ్యంలో ఈ తాజా సినిమా తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఇక దిశా ఘటన విషయానికి వస్తే.. శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు మానవ మృగాలు ఒక యువతిపై అత్యంత పైశాచికంగా దాడి చేసి హత్య చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన.. ఆ తర్వాత జరిగిన నిందితుల ఎన్‌కౌంటర్ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ  ‘దిశా ఎన్‌కౌంటర్’  సినిమాను నిర్మించాడు.  ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహించాడు.

తాజాగా ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరుతూ.. దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక జ్యుడియషల్ కమిషన్ వేసి స్వయంగా పర్యవేక్షస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో వర్మ తెరకెక్కించిన ఈ సినిమాను కేంద్ర ప్రభుత్వంతో పాటు సెన్సార్ బోర్ట్ ఎందుకు అడ్డుకోవడంలేదో తెలపాలంటూ దిశ తండ్రి తన పిటిషన్‌లో కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై స్పందించిన తెలంగాణ అదనపు సోలిసిటర్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ..  పిటిషనర్ ఈ సినిమాను అడ్డుకోవాలని రాత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ, సెన్సార్ బోర్డ్‌కు ఎలాంటి అభ్యర్ధన లేఖలు రాయలేదని పేర్కొన్నారు. దీంతో వాదనలు విన్న జడ్జ్.. ఈ విషయమై వెంటనే కేంద్రంతో పాటు సెన్సార్ బోర్డ్ .. దిశ తండ్రి అభ్యర్థనను పరిష్కరించాలని తీర్పు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here