Home Uncategorized బిగ్ బాస్‌కు నాగార్జున దూరం: ఆయన స్థానంలో మరో స్టార్ హీరో.. స్టార్ మా ప్లాన్...

బిగ్ బాస్‌కు నాగార్జున దూరం: ఆయన స్థానంలో మరో స్టార్ హీరో.. స్టార్ మా ప్లాన్ అదుర్స్.!

327
0

తెలుగులోకి వచ్చిన కొద్ది సమయంలోనే సూపర్ సక్సెస్ అయిపోయింది వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. దాదాపు మూడేళ్లుగా మన టెలివిజన్‌పై హవాను చూపిస్తోన్న ఈ షో… ఎన్నో రికార్డులను క్రియేట్ చేసేసింది. ఫలితంగా తెలుగులో నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. ఈ షో సక్సెస్ వెనుక ఎన్నో కారణాలున్నా… దానిని ముందుడి నడిపించిన హోస్టుల వల్ల మరింత హైలైట్ అయింది. మరీ ముఖ్యంగా అక్కినేని నాగార్జున సారథ్యంలో బిగ్ బాస్ సూపర్ హిట్ అవుతోంది. ఈ నేపథ్యంలో షో నుంచి ఆయన తప్పుకుంటున్నారు. అంతేకాదు, నాగ్ స్థానంలో మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాలు మీకోసం.!

ఆ కారణంగానే బిగ్ బాస్ హైలైట్ బిగ్ బాస్ షో తెలుగు కంటే ముందు నుంచే చాలా భాషల్లో ప్రసారం అవుతోంది. ఈ షోలో సెలబ్రిటీలు కంటెస్టెంట్ చేసినప్పటికీ… తరచూ ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంటారు. చిన్న చిన్న విషయాలకే కొట్టుకునే వరకు వెళ్తారు. ఈ కారణంగా బిగ్ బాస్ బాగా హైలైట్ అయింది. ఇక, ఇంటి బయట జరిగే కొన్ని వివాదాల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్

తెలుగులో వరుసగా నాలుగో సీజన్ తెలుగులో బిగ్ బాస్ మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ మూడు సీజన్లకు ముగ్గురు హీరోలు హోస్టులుగా చేశారు. మొదటి దాన్ని జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని, మూడో దానిని అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఇక, ఈ మధ్యనే నాలుగో సీజన్ కూడా మొదలైంది. దీనికి కూడా నాగార్జునే సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడిప్పుడే పెరుగుతోన్న ఆసక్తి అంగరంగ వైభవంగా ప్రారంభమైన నాలుగో సీజన్‌కు మొదట్లో పెద్దగా స్పందన రాలేదు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి మారిపోతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. లవ్ ట్రాకులు.. సరికొత్త టాస్కుల కారణంగా షోపై ఆసక్తి క్రమంగా పెరిగిపోతోంది. అన్నింటికీ మించి హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య జరుగుతోన్న గొడవల వల్ల ప్రేక్షకులు ఈ షో వైపు చూస్తున్నారు. దీంతో రేటింగ్ కూడా పెరుగుతోంది.

నాగ్‌కే సాధ్యం… రికార్డులు సొంతం ఈ సీజన్‌కు హోస్టుగా చేస్తున్న నాగార్జున… మూడో సీజన్‌ను సైతం విజయవంతంగా నడిపించారు. అప్పుడు ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు, గతంలో తన పేరిట ఉన్న రికార్డులను ఆయనే బద్దలు కొడుతున్నారు. తద్వారా భారీ రేటింగ్ సాధించిన షోగా బిగ్ బాస్‌ను దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిపాడు.

బిగ్ బాస్‌ షోకు నాగార్జున దూరం నాలుగో సీజన్‌ను విజయవంతంగా నడిపిస్తున్న నాగార్జున షో నుంచి తప్పుకుంటున్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. సినిమా కమిట్మెంట్ల కోసం ఆయన 20 రోజులు ఫారెన్ వెళ్లనున్నాడట. ఆ సమయంలో రెండు ఎపిసోడ్స్‌కు దూరం అవుతాడని సమాచారం. గత సీజన్‌లోనూ పుట్టినరోజు వేడుకల కోసం ఇలాగే బ్రేక్ తీసుకోగా.. రమ్యకృష్ణ హోస్ట్‌గా చేశారు.

ఆయన స్థానంలో మరో స్టార్ హీరో నాగార్జున బిగ్ బాస్ షోకు గైర్హాజరు అవుతోన్న నేపథ్యంలో… ఆయన స్థానంలో మరో హీరోను తీసుకొచ్చేందుకు స్టార్ మా ప్రయత్నాలు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే హోస్ట్‌గా చేసిన నేచురల్ స్టార్ నానితో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే… రెండు ఎపిసోడ్లకు హోస్టింగ్ చేయిస్తారనే టాక్ వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here