Home Entertainment నాని వ్యాఖ్యలను జగన్ సమర్దిస్తున్నారా? లేక ఆయనే అలా మాట్లాడిస్తున్నారా?

నాని వ్యాఖ్యలను జగన్ సమర్దిస్తున్నారా? లేక ఆయనే అలా మాట్లాడిస్తున్నారా?

682
0

ఒక పక్క కేంద్రంలోని పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తుంటే… ఇంకో పక్క అమరావతిలో ఆయన మంత్రి కొడాలి నాని అదే మోడీ పై వ్యక్తిగత విమర్శలు చెయ్యడం విశేషం. రాష్ట్రంలోని దేవాలయాల పై దాడుల గురించి…. తిరుమల డిక్లరేషన్ గురించి బీజేపీపై విమర్శలు కురిపించారు నాని.

“ప్రధాని మోదీని తన సతీమణిని తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమనండి. మోదీ, యూపీ సీఎం మాత్రం ఒంటరిగా ఆలయాలకు వెళ్తారు.. జగన్‌ మాత్రం కుటుంబసమేతంగా ఆలయానికి రావాలా?, అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు నాని. గతంలో టీడీపీ బీజేపీలకు చెడినప్పుడు కూడా చివరి అంకంలో ఎన్నికల ముందు మాత్రమే రెండు వైపుల వారు వ్యక్తిగత విమర్శలు చేశారు.

దేవాలయాల మీద దాడుల విషయంగా నాని చేసిన వ్యాఖ్యలకు ఆయనను కేబినెట్ నుండి బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేస్తుంది బీజేపీ అని ప్రస్తావించగా… “అత్యధిక ఓట్లు వచ్చిన జగన్ కు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకు సలహాలు ఇస్తుందా?, అంటూ ఎదురుదాడికి దిగారు కొడాలి నాని.

నాని ఇప్పుడు కూడా మీడియా ముందు ఇలా రెచ్చిపోయి మొట్లాడారంటే… మొన్న దేవాలయాల మీద దాడుల విషయంగా ఆయనను ముఖ్యమంత్రి జగన్ కనీసం వారించలేదు అని అర్ధం అవుతుంది. అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్ సమర్దిస్తున్నట్టేనా? లేక ఆయనే నానితో అలా మాట్లాడిస్తున్నారా?,” అంటూ పలువురు అనుమానపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here