శ్రీవారి సొమ్ము మీద ఆంధ్రప్రదేశ్ సర్కారు కన్నేసిందా?

0
25

మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వివిధ సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల వైపు చూస్తుందట. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామంటూ శ్రీవారి సొమ్ము ప్రభుత్వ ఖజానాకు మళ్లించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. గతంలో టీడీపీ హయాంలో ప్రైవేటు బ్యాంకులలో అధిక వడ్డీ వస్తుందని అప్పటి బోర్డు ఆలోచన చెయ్యగా వైఎస్సార్ కాంగ్రెస్ పెద్ద దుమారమే లేపింది.

 

దానితో ఎప్పటీలంటే ప్రభుత్వరంగ బ్యాంకులలోనే టీటీడీ సొమ్ము ఉంచుతుంది. బ్యాంకుల ద్వారా ప్రస్తుతం 3 నుంచి 4 శాతం మాత్రమే వడ్డీ లభిస్తోందని.. అదే బాండ్ల ద్వారా 7 శాతం లభించే అవకాశం ఉందని టీటీడీ ఆలోచన చేస్తుందట. అసలు విషయం మాత్రం విశృంఖలంగా అప్పులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు అప్పులు పుట్టే పరిస్థితి కనిపించడం లేదు.

దీనితో అధిక వడ్డీ పేరుతో టీటీడీ నిధులను ప్రభుత్వ ఖజానాకు మళ్లిస్తారు. అయితే ప్రభుత్వం టీటీడీ నిధులను సక్రమంగా చెల్లించగలదా? ప్రభుత్వం తోనే నియమింపబడ్డ బోర్డులు ఇవ్వకపోతే గట్టిగా అడగ్గలవా? కోర్టులకు వెళ్లగలవా? కాబట్టి ఆ నిధులు సంతర్పణ అయిపోయినా ఆశ్చర్యం లేదు.

ఇప్పిటికే శ్రీవారి భూముల అమ్మకంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంతో బోర్డు వెనుకడుగు వేసింది. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న సమయంలో ఇటువంటి నిర్ణయం సాహసం అనే చెప్పుకోవాలి. అయితే ఇది ప్రస్తుతం ఆలోచన స్థాయిలోనే ఉందని ఆ నివేదికలు చెబుతున్నాయి. మరి ఇటువంటి తరుణంలో ప్రభుత్వం రిస్కు తీసుకుంటుందా అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here