అటు నిర్మాతలకు… ఇటు మీడియాకు కూడా దొరకని రకుల్

0
25

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్, రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబట్టా పేర్లను కొద్ది రోజుల క్రితం ఒక ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ వెల్లడించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తులో రియా చక్రవర్తి వెల్లడించిన బాలీవుడ్ ఎ-లిస్టర్ల మూడు పేర్లు ఇవి అని ఆ నివేదిక పేర్కొంది.

అయితే, ఈ ఆరోపణపై ఇప్పటివరకు రకుల్ స్పందించలేదు. తరువాత, మీడియా ఊహించినట్లుగా తమ వద్ద బాలీవుడ్ నటుల జాబితా అలాంటిదేమీ లేదని ఎన్‌సిబి స్పష్టం చేసింది. అయితే ఆ స్పష్టీకరణ తర్వాత కూడా రకుల్ మీడియా ముందు రాలేదు. ఆమె తరచు మీడియాతో టచ్ లో ఉండే ఒక మొబైల్ నంబర్‌ను కూడా మార్చేసింది.

ఈ ఆరోపణలు మొదట వెలువడినప్పుడు, ఆమె హైదరాబాద్‌లో తన రాబోయే చిత్రం షూటింగ్ షూటింగ్ లో ఉంది. అయితే ఉన్నఫళంగా లొకేషన్ నుండి వెళ్ళిపోయింది. నిర్మాతలు కూడా తమకు ఆమె ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, అయితే పరిస్థితిని తాము అర్ధం చేసుకోగలమని అంటున్నారట.

తన హైదరాబాద్ నివాసంలో కూడా లేదని అంటున్నారు. ఈ నివేదికలతో ఆమె చాలా కలత చెందినట్లు కనిపిస్తోంది. రకుల్ ప్రస్తుతం నితిన్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో వస్తున్న చెక్…వైష్ణవ్ తేజ్… క్రిష్ కాంబినేషన్లో వస్తున్న ఒక సినిమాలో నటిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here