స్టార్ యాంకర్ శ్రీముఖి తన తాజా టాక్ షో ను ప్రోమోట్ చేసుకోవడం కోసం గట్టిప్రయత్నాలే చేస్తుంది. ఓ వుమనియా అనే టాక్ షో ద్వారా శ్రీముఖి సెలబ్రిటీ లేడీస్ ని ఇంటర్వ్యూ చేయనున్నారట. ఈ టాక్ షో కోసం శ్రీముఖి చేస్తున్న ఫోటోషూట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి.
యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖికి యూత్ లో బాగానే క్రేజ్ ఉంది. నటిగా కెరీర్ ప్రారంభించినా ఆమె యాంకర్ గానే పేరుతెచ్చుకుంది. ఈటీవి ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్ షోలో యాంకర్ రవితో పాటు శ్రీముఖి చేసే రచ్చ బాగా పాప్యులర్. ఆ షోతో శ్రీముఖి వెలుగులోకి వచ్చింది.
టెలివిజన్ హోస్ట్ గా మారకముందే శ్రీముఖి నటిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 2012లో వచ్చిన జులై మూవీలో శ్రీముఖి వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించింది.
దాదాపు డజను సినిమాల వరకు చేసిన శ్రీముఖి నేను శైలజ, జెంటిల్ మెన్ వంటి హిట్ చిత్రాలలో కూడా నటించింది. అవసరాల శ్రీనివాస్ హీరోగా వచ్చిన అడల్ట్ కామెడీ చిత్రం బాబు బాగా బిజీ లో ఆమె చివరిసారిగా నటించారు.
గత ఏడాది బిగ్ బాస్ షోలో పాల్గొన్న శ్రీముఖి టైటిల్ కోసం గట్టిపోటీ ఇవ్వడంతో పాటు రన్నర్ గా నిలిచింది. సీజన్ 3 టైటిల్ రాహుల్ సింప్లిగంజ్ అందుకోగా శ్రీముఖి రన్నర్ టైటిల్ దక్కించుకుంది. ఈ షో వలన డబ్బులు సంపాదించినా, పాపులారిటీ పోగొట్టుకుందని కొందరు అంటారు.
శ్రీముఖి యూట్యూబ్ లో ఓ టాక్ షో ప్రారంభించనున్నారు. ఓ వుమనియా అనే టైటిల్ తో ప్రసారం కానున్న ఈ టాక్ షో కోసం శ్రీముఖి డబ్బులు బాగానే ఖర్చు పెడుతుంది. సెలబ్రిటీ లేడీస్ ని శ్రీముఖి ఈ టాక్ షో ద్వారా ఇంటర్వ్యూ చేయనున్నారు. ఈ టాక్ షో కోసం శ్రీముఖి ప్రోమో సాంగ్ చేయడంతో పాటు, ఫోటో షూట్స్ చేస్తుంది.
తాజాగా శ్రీముఖి జరిపిన ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. బ్రౌన్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి శ్రీముఖి తనలోని గ్లామర్ యాంగిల్ బయటపెట్టింది. శ్రీముఖి తాజా ఫోటోలు చూసిన నెటిజెన్స్ వావ్ అంటున్నారు. శ్రీముఖి గ్లామర్ ని పరిశ్రమ సరిగా వాడుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.