Home Entertainment అర్థరాత్రి అఖిల్ దుప్పట్లో కరాటే…మోనల్ గుజ్జర్ చెప్పినా వినకుండా…

అర్థరాత్రి అఖిల్ దుప్పట్లో కరాటే…మోనల్ గుజ్జర్ చెప్పినా వినకుండా…

660
0

Bigg Boss 4: హౌజ్ మేట్ అఖిల్ నిద్రలోకి జారుకున్న సమయంలో పెద్ద పెట్టున గురక పెడుతున్నాడని, అతడి శబ్దాలతో తనకు నిద్ర పట్టడం లేదని మోనాల్ తన లాస్య, హారిక, సుజాతల ముందు వాపోయింది.

బిగ్ బాస్ 4 ఫుల్ టెన్షన్ గా సాగుతున్నాయి. అయితే మధ్య మధ్యలో సరదా సన్నివేశాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. నోయల్ నిత్యం గొడవలతో అల్లరి పెడుతుంటే, కరాటే కళ్యాణి కూడా చిటపటలాడుతూ అందరిలో తాను ప్రత్యేకం అన్నట్లు కొనసాగుతోంది. అటు లాస్య, అమ్మ రాజశేఖర్ సహా మిగితా కంటెస్టెంట్లు కూడా సైలెంటుగా తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇక స్టార్ ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ కూడా తనదైన స్టైల్ లోనే చెలరేగి పోతోంది. ఇప్పటికే సూర్యకిరణ్ ఎగ్జిట్ అవ్వగా, తాజాగా కుమార్ సాయి ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే అఖిల్ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఆదివారం డ్యాన్సు పోటీలో వెనుకంజ వేసినప్పటికీ, అఖిల్ తన ఆటిట్యూడ్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు అఖిల్ తన బాస్ నాగార్జునను తెగ ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా అఖిల్ నామినేషన్స్ నుంచి సేవ్ అయినప్పుడు, అతడి కోసం నాగార్జున అఖిల్ చిత్రంలోని పాటను ప్లే చేసి సర్ ప్రైజ్ చేశాడు. ఇక హౌజ్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు అప్పుడప్పుడు కాస్త ఎక్కువగానే అవుతున్నాయి.

ముఖ్యంగా నిద్ర పోయే సమయంలో గొడవలు పెద్ద ఎత్తున అవుతున్నాయి. దీనిపై ఇప్పటికే నాగార్జునకు గంగవ్వ ఫిర్యాదు చేసింది. అర్థరాత్రి దాటినా కంటెస్టెంట్లు నిద్రపోకుండా తనను డిస్టర్బ్ చేస్తున్నారని గంగవ్వ కంప్లైట్ చేసింది. అయితే సరిగ్గా ఇలాంటి ఫిర్యాదులే మోనాల్ గుజ్జర్ నుంచి కూడా వస్తున్నాయి. హౌజ్ మేట్ అఖిల్ నిద్రలోకి జారుకున్న సమయంలో పెద్ద పెట్టున గురక పెడుతున్నాడని, అతడి శబ్దాలతో తనకు నిద్ర పట్టడం లేదని మోనాల్ తన లాస్య, హారిక, సుజాతల ముందు వాపోయింది. ముఖ్యంగా అఖిల్ అర్ధరాత్రి దుప్పటి కప్పుకొని పెద్ద పెట్టున చేసే గురక తనకు రాత్రంతా నిద్ర లేకుండా చేస్తోందని చెప్పుకొచ్చింది.

అయితే సరిగ్గా తెలుగు మాట్లాడటం రాని, మోనాల్ హిందీలోనే తన గోడు వెళ్ల బోసుకుంది. అఖిల్ దుప్పట్లోంచి కరాటేలు కొడుతుంటాడని అనడంతో అక్కడ ఉన్న వారికి కరాటే అంటే అర్ధం కాలేదు. ఇంగ్లీషులో స్నోరింగ్ అంటే గురక పెడుతున్నాడని మోనల్ చెప్పుకొచ్చింది. గురకను హిందీలో కరాటే అంటారని తర్వాత మోనల్ వివరణ ఇచ్చింది. అయితే అఖిల్ తన బెడ్ మార్చుకుంటానని కన్నీళ్లు పెట్టుకున్న మోనాల్ ను ఊరడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here