Home Entertainment రకుల్ మౌనానికి అర్ధం ఏంటి?

రకుల్ మౌనానికి అర్ధం ఏంటి?

530
0

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్, రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబట్టా పేర్లను ఒక ఇంగ్లీష్ ఛానల్ వెల్లడించి రెండు రోజులు కావొస్తుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తులో రియా చక్రవర్తి వెల్లడించిన బాలీవుడ్ ఎ-లిస్టర్ల మూడు పేర్లు ఇవి అని ఆ వార్త ఛానల్ నివేదిక పేర్కొంది.

అయితే, సారా మరియు రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరూ ఇప్పటివరకూ ఈ ఆరోపణలను ఖండించలేదు. అప్పటి నుండి రకుల్ సోషల్ మీడియాలో కూడా ఎటువంటి పోస్టులు పెట్టడం లేదు. నిజంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రాడార్ కింద వారి పేర్లు ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతుందని అంటున్నారు పలువురు.

అయితే ఈ కేసులో వారు మూడవ వ్యక్తికి పంపిణీ చేయకపోతే, అరెస్టు చేసే అవకాశాలు ఉండవని న్యాయ నిపుణులు అంటున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ విచారణకు సంబంధించిన డ్రగ్స్ ఆరోపణలపై రియా చక్రవర్తి ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్నారు. ఆమెతో పాటు ఈ కేసులో పాల్గొన్న ఇతరులకు ముంబై సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించింది.

ఆమె న్యాయవాదులు సోమవారం ముంబై హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఇన్వెస్టిగేషన్ సందర్భంగా రియా వెల్లడించిన 25 మందికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆరోపణలపై వారి సంజాయిషీ కోరే అవకాశం ఉంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here