Home Entertainment మేమింకా హీరోయిన్ ని ఎంపిక చెయ్యలేదు.. అవన్నీ రూమర్స్!!

మేమింకా హీరోయిన్ ని ఎంపిక చెయ్యలేదు.. అవన్నీ రూమర్స్!!

614
0

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ తో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా అనౌన్స్ చెయడమే మొదలు ఆ సినిమాపై రకరకాల న్యూస్ లు ప్రచారంలోకొస్తున్నాయి. అయితే ఆదిపురుష్ ప్రకటన తర్వాత ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ తో ధీటుగా నిలబడే విలన్ సైఫ్ అలీ ఖాన్ అని ప్రచారం జరుగుతుండగా.. ఓం రనౌత్ ఆదిపురుష్ టీం.. తమ సినిమాలో విలన్ పాత్రకి సైఫ్ అలీ ఖాన్ అంటూ ప్రకటించారు. తర్వాత ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సీత గా సౌత్ భామ కీర్తి సురేష్ అని కాదు.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే తాజాగా కీర్తి సురేష్, కియారాలు కాదు.. ఈ సినిమాలో మాజీ మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతేలా పేరు సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చింది. బాలీవుడ్ బోల్డ్ భామ ఊర్వశి ప్రభాస్ ఆదిపురుష్ సీతగా ఎంపిక చేసినట్లుగా వార్తలొస్తున్న వేళ ఆదిపురుష్ టీం లైన్ లోకొచ్చి మేము ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ కి జోడిగా ఇంకా హీరోయిన్ ని ఎంపిక చెయ్యలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న పేర్లతో మాకు సంబంధం లేదు.. కేవలం అవన్నీ పుకార్లే అని కొట్టిపారెయ్యడమే కాదు.. హీరోయిన్ ఎంపిక జరిగాక స్వయానా మేమె ప్రకటిస్తామని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here