బిజీ షెడ్యూల్ మధ్య కరోనా సోకకుండా తాను ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నది ఓ వీడియోలో యాంకర్ సుమ కనకాల వెల్లడించారు. అందరూ అలా చేయాలంటూ సూచించారు.
కరోనాతో సహజీవనానికి చాలా మంది సెలబ్రిటీలు సన్నద్ధమైపోయారు. నాలుగైదు నెలలు తమ ఇళ్లకే పరిమితమైన సినీ తారలు కూడా షూటింగ్ మొదలుపెట్టేశారు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల కూడా పలు టీవీ కార్యక్రమాల షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకకుండా తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నానో? ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎపిసోడ్‌కి ఎపిసోడ్‌కి మధ్యలో కాస్త విరామం దొరికినప్పుడు తాను ఆవిరి పడుతున్నట్లు ఆ వీడియోలో సుమ తెలిపారు. ఆవిరి పట్టడం ద్వారా కరోనా వైరస్ బారినపడకుండా జాగ్రత్తపడొచ్చని ఇప్పటికే పలువురు వైద్య నిపుణులు సూచించారు. దీని పట్ల ప్రజల్లోనూ అవగాహన కలిగించేలా సామాజిక స్పృహతో సుమ ఈ వీడియో పోస్ట్ చేయడాన్ని నెటిజన్స్ అభినందిస్తున్నారు