తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా తెలంగాణలో 2,932 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మరణించారు. తెలంగాణలో మొత్తం 1,17,415 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 799 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 28,941 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని 87,675 మంది ఇప్పటి వరకూ డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ నగరంలో తాజాగా 520 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.