విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో నిందితుల నుంచి పోలీసులకు సహాయ నిరాకరణ ఎదురైంది. విజయవాడ జిల్లా జైలులో ఉన్న ముగ్గురు నిందితులను విచారించేందుకు వెళ్లిన పోలీసులకు నిందితుల తరపు న్యాయవాదులు సహకరించలేదు. అసలు వారు జైలు వద్దకే రాలేదు. జిల్లా కోర్టు అనుమతితో నిందితులను విచారించేందుకు ఏసీపీ సూర్యచంద్రరావు నేతృత్వంలో పోలీసులు జిల్లా జైలుకు వెళ్లారు. న్యాయవాదుల సమక్షంలోనే నిందితులను విచారించాలని కోర్టు ఆదేశాలున్నాయి. కానీ నిందితుల తరపు న్యాయవాదులు మాత్రం అక్కడికి రాలేదు.