పూరి జగన్నాథ్ సినిమా డైలాగ్‌లే ఒకటికి నాలుగు సార్లు విని ఎంజాయ్ చేస్తూంటారు. ఆయన డైలాగుల్లో నిజ జీవిత సత్యాలు దొర్లుతూంటాయి. మనం నార్మల్ గా బయిట మాట్లాడుకునే మాటలే డైలాగుల రూపంలో వినిపిస్తూంటాయి. అంతేకాదు బయట ఆయన మాటలు కూడా ఘాటుగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పూరి మాటలు సినిమాల్లో విందామంటే కుదరే పరిస్దితి లేదు. దీంతో యూట్యూబుల్లో, ఓటీటీల్లో పాత సినిమాల డైలాగ్‌లు విని ఆనందిస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఆయన మాటలన్నీ మూటగట్టి ఓ పాడ్‌కాస్ట్‌ను రూపొందించాడు. పాడ్‌కాస్ట్ ‘మ్యూజింగ్స్’’ అంటూ పాడ్‌కాస్ట్‌ను మొదలుపెట్టారు పూరి. అందులో భాగంగా తాజాగా కామసూత్రపై ఆయన మాట్లాడారు. ఆ పాడ్ కాస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన అందులో ఏం చెప్పారో చూద్దాం.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ…మన పూర్వికులతో పోల్చితే మనం సెక్స్ చేయనట్టే లెక్క అంటూ రెచ్చిపోయారు పూరి జగన్నాథ్. రీసెంట్ గా విడుదల చేసిన పోడ్కాస్ట్ ఆడియోలో కామ సూత్రాలన్నీ విప్పి చెప్పారు.
పూరి మాటల్లోనే…”కామసూత్ర.. ఈ పేరు వినగానే మనలో కోటి వీణలు మోగుతాయి. కామం అంటే అంతిష్టం మనకి. ప్రపంచానికి సెక్స్ అంటే ఏంటో నేర్పింది మనమే. కామసూత్ర చదివి జ్ఞానం సంపాదించుకొని ఆ తర్వాత సెక్స్ స్టార్ట్ చేయమని మన పెద్దల భావం.
కానీ మనమేం చేస్తాం.. ముందు సెక్స్ చేస్తూ పోతాం. మధ్యలో ఎక్కడైనా కామసూత్ర బుక్ తగిలితే ఆశగా బొమ్మలు చూస్తాం. అర్రర్రే చాలా యాంగిల్స్ మిగిలిపోయాయి అని. అంతే తప్ప వాత్సాయణుడు ఏం చెప్పాడో ఆలోచించం.
కామసూత్ర అనేది ఆర్ట్ ఆఫ్ లివింగ్. అందరం జీవితంలో ధర్మార్ధ కామ మోక్షాలను సాధించాలి. ధర్మ అంటే లైఫ్ అండ్ యూనివర్స్. అర్థ అంటే జీవితానికి అర్థం.
కామ అంటే కోరిక. మోక్ష అంటే విముక్తి. వీటన్నింటినీ మనం జయించాలి. కామసూత్ర అన్ని రకాల సెక్స్ గురించి తెలుపుతుంది.
మన పూర్వికులు చేయని సెక్స్ లేదు. వాళ్ళు చేసినవన్నీ మనం పురాతన దేవాలయాల్లో చూడొచ్చు. ఆ బొమ్మలు చూస్తే, వాళ్ళతో పోలిస్తే మనం అస్సలు సెక్స్ చేయనట్టే లెక్క.