బ్రేకింగ్:-బెంగళూరు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

0
65

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెంగళూరుకు చేరుకున్నారు. సీఎం పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూలులో సీటు దక్కించున్న విషయం తెలిసిందే. తన కుమార్తెను పారిస్‌కు పంపేందుకు వైఎస్‌ జగన్‌ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. సీఎం జగన్‌ రాకతో బెంగళూరు విమానశ్రయం వద్ద ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు.

కాగా ప్రపంచంలోని టాప్‌ 5 బిజినెస్‌ స్కూల్స్‌లో ఇన్సీడ్‌ ఒకటి. అక్కడ హర్షారెడ్డి మాస్టర్స్‌ చేయనున్నారు. హర్షారెడ్డి చిన్నప్పటి నుంచి రాసిన ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్‌ సాధించారు. ఇప్పటికే లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థ(ఎంఎన్‌సీ)లో ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌గా ఉద్యోగం వచ్చినా.. దానిని వదులుకుని ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో మాస్టర్స్‌ చేయడానికి మొగ్గుచూపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here