భారత్ లో పెట్రో వడ్డన కొనసాగుతూనే ఉంది. గత పదిరోజుల్లో తొమ్మిది సార్లు పెట్రోలు ధరలను పెంచారు. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 81.73 గా ఉంది. ఆయిల్ కంపెనీల ఆధిపత్యంతో ప్రతిరోజూ పెట్రోలు ధరలను పెంచుతున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయం అన్న కనికరం లేకుండా ధరలు పెంచుకుంటూ పోతుండటంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి.