తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత అలాగే కొనసాగుతోంది. రోజుల తరబడి ఒకే విధంగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 23వేల 841 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1724 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 97 వేల 424కు పెరిగింది. అటు కరోనా కారణంగా నిన్న 10 మంది మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 729కి చేరింది.
నిన్న రాష్ట్రవ్యాప్తంగా 1195 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 75 వేల 186కి చేరింది. ప్రస్తుతం 21 వేల 509గా మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 15 వేల 76 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు తెలంగాణలో 8 లక్షల 21 వేల 311 నమూనాలను పరీక్షించారు.