తెలంగాణలో కరోనా ఉధృతి అదే స్థాయిలో కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 24 వేల 542 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1763 కేసులు నమోదయ్యాయి. మరో 1042 బాధితుల రిపోర్టులు పెండింగ్లో ఉన్నాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 95 వేల 700కు చేరింది. మరోవైపు కరోనా కారణంగా నిన్న 8 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 719కి పెరిగింది.
కరోనా వైరస్ నుంచి నిన్న 1789 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 73 వేల 991 మంది ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 వేల 990 మంది చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 7 లక్షల 97 వేల 470 మందికి కరోనా టెస్టులు చేశారు.