నిహారిక కొణిదెల.. ఇటు సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్లోను రాణిస్తోంది. ఆమె ఇప్పటి వరకు తెలుగులో చిరు సైరాతో కలిపి నాలుగు చిత్రాల్లో నటిచింది. సినిమాల్లో నిహారికు అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. దీంతో త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకింటామె కాబోతుంది. ఈమె గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు ఓ ఓ పెద్ద ఐటీ కంపెనీలో పని చేస్తున్న వెంకట చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. చిరంజీవి ముందుండి ఈ సంబంధాన్ని కలిపాడు. ఎన్నాళ్ల నుంచో తెలిసిన కుటుంబాన్ని తన తమ్ముడి కూతురుకు కలుపుకున్నాడు మెగాస్టార్. పెళ్లి కుదిరిన తర్వాత చైతన్య, నిహారిక జంట సోషల్ మీడియాలో ఫోటోలు, పోస్టులతో సందడి చేస్తున్నారు. త్వరలో వీరి నిశ్చితార్ధం జరగనుంది. ఆ సంగతి పక్కనపెడితే.. ఓ వైపు పెళ్లి రెడీ అవుతూనే.. మరోవైపు టీవీల్లో పలు షోల్లో పాల్గొంటుంది మెగా డాటర్ నిహారిక.
https://www.instagram.com/p/CDx0StYlo12/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again