సోషల్ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుని, ట్రోల్స్ చేస్తున్న కొంతమంది బీజేపీ నాయకులపై టాలీవుడ్ నటి మాధవీలత తనదైన స్టైల్ లో చురకలంటించారు. ఫేస్ బుక్ ఖాతాలో తెలుగులో ఓ పోస్ట్ పెట్టారు. కొందరు బీజేపీ నాయకులు తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. నేను రెండేళ్ల క్రితం బీజేపీలో చేరాను. నేను పార్టీ లో చేరినపుడు ఒక మాట చెప్పాను. ఇపుడు అదే మాట మీద ఉన్నాను. నా పార్టీ అయినా ఎవరైనా తప్పు చేస్తే తప్పే అని బరాబర్ చెప్తా… నన్ను దూరం పెడతారు అనే భయం లేదు. దూరం అవుతా అన్న బెంగ లేదు. నేనెపుడు దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తాను..మనుషుల కోసం వత్తాసుల కోసం కాదు. సమయం సందర్భం చూసి ఎవరు ఎక్కడ రాజకీయ కుట్రలు చేస్తున్నారో. చెప్పేస్తా. మోడీజీ స్టైల్ లో పేరు చెప్పను కానీ ఎదుటోడికి తెలిసిపోద్ది ఇత్తడైపోద్ది. ఇది పగ కాదు ప్రతీకారం కాదు..బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి..బాధ్యతరాహిత్యంగా ఉండటం తప్పని..కొందరు నేతలకు సూచిస్తూ..సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది.
అంతేకాదు తన వ్యక్తిగత జీవితంపై ట్రోల్స్ చేస్తున్న వారికి రిప్లై ఇస్తూ..ప్రజలకు వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించడం ఫ్యాషన్ గా మారిపోయింది. నా బెడ్ రూం దాకా వెళ్లే ధైర్యం చేయొద్దు..వెళ్తే ఎలా స్పందించాలో నాకు తెలుసునని మాధవీలత మరో పోస్ట్ పెట్టారు.