ఉస్మానియాను సేవ్ చేయండి- న్యూ ఉస్మానియాను నిర్మించండి

0
37

సేవ్ ఉస్మానియా, బిల్డ్ న్యూ ఉస్మానియా పేరుతో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో వైద్యులు ఆందోళన బాట పట్టారు. ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడేందుకే ఆనాడు ఉస్మానియాను క‌ట్టార‌ని, ఇప్పుడు కూలిపోతున్న భవనాన్ని అడ్డుకొని ప్రాణాలు తీయ‌వ‌ద్దంటూ డాక్ట‌ర్లు నినాదాలు చేశారు. ఆసుప‌త్రికి వ‌చ్చిన ప్ర‌జ‌ల ప్రాణాలు, ప‌నిచేస్తున్న సిబ్బంది ప్రాణాలు ప్ర‌మాదంలో ఉన్నాయ‌ని, ఇక ఉస్మానియాను కూల్చేందుకు ఎవ‌రైనా అడ్డువ‌స్తే ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. వెంట‌నే ఉస్మానియా ఆసుప‌త్రికి కొత్త భ‌వ‌నం క‌ట్టాల‌ని వైద్యులు డిమాండ్ చేశారు.

గ‌తంలో కొత్త భ‌వ‌నం కట్టేందుకు పాత భ‌వ‌నాన్ని కూల్చాల‌న్న ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై కోర్టుకు వెళ్లార‌ని, ఈసారి అలాంటి ప‌రిస్థితి త‌లెత్త‌కుండా అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని వైద్యులు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here