Home News అద్దె గ‌ర్భాల ద్వారా పిల్లల్ని కన్న సెల‌బ్రెటీలు …! దాని కోసం కారణాలు ఏమిటి? అస‌లు...

అద్దె గ‌ర్భాల ద్వారా పిల్లల్ని కన్న సెల‌బ్రెటీలు …! దాని కోసం కారణాలు ఏమిటి? అస‌లు అద్దె గ‌ర్భం అంటే ఏంటి?

363
0

అమ్మతనం అనేది ఒక వరం.. పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక శాపంగా భావించేవాళ్లు ఒకప్పుడు..కానీ ఇఫ్పుడు పిల్లల్ని కనడానికి ఎన్నో మార్గాలు సరోగసి(అద్దెగర్భం), టెస్ట్ ట్యూబ్ బేబిస్.. ఆరోగ్య కారణాలు లేదా ఇతరత్రా కారణాల రిత్యా పిల్లలు కలగని వారు ఎక్కువ మంది సరోగసి ద్వారా పిల్లల్ని పొందుతున్నారు..అటువంటి కొందరు సెలబ్రిటీల గురించి ఇప్పుడు చూద్దాం..

మంచు లక్ష్మీ:

బాలివుడ్ లోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సరోగసి ద్వారా పిల్లల్ని పొందినవారున్నారు.. సెలబ్రిటిల విషయానికి వస్తే మంచు లక్ష్మీ గారాలపట్టి విద్యానిర్వాణ సరోగసి ద్వారా పుట్టిన బిడ్డ.. తాను తల్లి అయ్యానని లక్ష్మి ప్రకటించగానే ముందుగా అందరూ షాక్ అయ్యారు..తెలుగు రాష్ట్రాల్లో సరోగసి కోసం ట్రై చేస్తే మీడియా భయంతో సరోగేట్ మదర్ కోసం గుజరాత్ వరకు వెళ్లారు మంచు లక్ష్మి దంపతులు..


సన్నిలియోన్:

ఒక బిడ్డని దత్తత తీసుకోవడం ద్వారా అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన ఒకప్పటి పోర్న్ స్టార్ మరియు ప్రస్తుత బాలివుడ్ నటి సన్నిలియోన్ ..తర్వాత కవల పిల్లల్ని సరోగసి ద్వారా పొందింది.. దత్తత తీసుకున్న బిడ్డ పేరు దిశ కాగా, కవల పిల్లలకు నోహ్,ఆషర్ అని పేర్లు పెట్టుకున్నారు సన్ని దంపతులు.

అమీర్ ఖాన్:

మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మాజీ భార్య రీనాకు జునైద్ మరియు ఇరా అని ఇద్దరుపిల్లలున్నారు.. రీనాతో విడాకుల తర్వాత కిరణ్ రావుని వివాహం చేసుకున్నాడు అమీర్.. వీరిద్దరికి సరోగసి ద్వారా కలిగిన కొడుకు ఆజాద్ రావ్.. కిరణ్ రావు 36ఏళ్ల వయసులో ఒకసారి అబార్షన్ జరగడంతో అనారోగ్య సమస్యలు తలెత్తి సరోగసికి వెళ్లినట్టు సమాచారం.

షారూక్ ఖాన్- గౌరీ ఖాన్:

షారూక్ ,గౌరిల మూడో కొడుకు అబ్రామ్ ఖాన్ సరోగసి ద్వారా పుట్టిన బిడ్డ. ప్రస్తుతం ఆ బిడ్డ తల్లి గురించి చర్చ జరుగుతుంది.. గౌరి సోధరుడి భార్య నమిత చబ్బెర్ అబ్రామ్ ఖాన్ బయోలాజికల్ మదర్ కావడం విశేషం..40 ఏళ్ల వయసులో బిడ్డని కనడానికి గౌరి ఆరోగ్యం సహకరించకపోవడే సరోగసి ద్వారా బిడ్డను కనాలనుకోవడం వెనుక గల కారణం.

ఫరా ఖాన్:

కొరియోగ్రాఫర్ మరియు డైరెక్టర్ ఫరాఖాన్, శిరీష్ కుందర్ ల ముగ్గురు బిడ్డలు (ట్రిప్లేట్స్) సరోగసి ద్వారా పుట్టిన పిల్లలే..వీరికి సరోగసి ద్వారా ముగ్గురు కవలలు పుట్టారు..వారిలో ఇద్దరు ఆడపిల్లలు అన్య, దివా..ఒకరు అబ్బాయి సిజర్ కుందర్..ఫరాఖాన్ ఏజ్ పెరగడం,అనారోగ్య సమస్యలు తలెత్తడం వలన సరోగసి ద్వారా పిల్లల్ని కనాలనుకున్నారు ఈ దంపతులు.

తుషార్ కపూర్:

బాలివుడ్ నటుడు తుషార్ కపూర్ కొడుకు పేరు లక్ష్య..పెళ్లి కాని తుషార్ ఒక బిడ్డకు తండ్రి కావాలనుకున్నాడు. అందుకు సరోగసి ఒక్కటే మార్గం అని భావించి దానిద్వారా కొడుకుని పొందాడు. సింగిల్ పేరెంట్ గా ఉంటూనే తన కొడుకు బాగోగుల్ని చూసుకుంటున్నాడు తుషార్.తుషార్ అక్క నిర్మాత ఏక్తా కపూర్ కూడా సరోగసి ద్వారానే బిడ్డని పొందారు..వీరిద్దరి సరోగేట్ మదర్ ఒక్కరే అన్నట్టు సమాచారం.


కరణ్ జోహార్:

బాలివుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఇద్దరు పిల్లల పేర్లు రూహి మరియు యశ్..వీరిద్దరూ సరోగసి ద్వారా పుట్టిన పిల్లలే. కరణ్ తన తల్లి సాయంతో ఈ పిల్లలిద్దరి ఆలనా పాలనా చూస్తుంటారు..తుషార్ మాదిరిగానే కరణ్ కూడా సింగిల్ పేరెంట్.

అద్దె గ‌ర్భం ( స‌రోగ‌సి) రెండు విధాలుగా ఉంటుంది.

1. భార్య నుంచి అండాన్ని, భర్త నుంచి వీర్యాన్ని సేకరించి కృత్రిమ వాతావరణంలో ఫలదీకరించి మరో మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టి ఆమె ద్వారా పిల్లలను కనడం. దీన్నే గెస్టేషనల్‌ సరోగసి అంటారు.

2. దంపతుల్లో భార్యకు సమస్య ఉన్నప్పుడు భర్త వీర్యాన్ని మరో మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టి సంతానం కలిగించడం. దీన్ని ట్రెడిషనల్‌ సరోగసి అంటారు.

ఈ విధానాల ద్వారా అద్దెగర్భానికి అంగీకరించిన స్త్రీ డ‌బ్బును తీసుకుంటే దాన్ని కమర్షియల్‌ సరోగసి అని, కేవలం వైద్యానికి అయ్యే ఖర్చులు మాత్రమే తీసుకొంటే దాన్ని ఆల్ట్రాయిస్టిక్ ‌ సరోగసి అని అంటారు. ఇండియాలో కమర్షియల్‌ సరోగసి నిషిద్దం.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here