అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసే తేదీని రేపు ఖరారు చేయాలని శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. దీనిలోభాగంగా శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రేపు సమావేశం కానుంది. రామాలయం నిర్మాణపనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రవెూడీని ఆహ్వానించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం తేదీ ఖరారయ్యాక ట్రస్టు సభ్యులు ప్రధానమంత్రి వెూదీని కలిసి ఆహ్వానించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి వెూదీ ఆవెూదించే తేదీన ఆలయ పనులకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్లు ట్రస్టు ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా చెప్పారు. రామాలయం శంకుస్థాపన కార్యక్రమంలో రాష్టీయ్ర స్వయం సేవక సంఘ్ చీఫ్ వెూహన్ భగవత్ కూడా పాల్గొంటారని మిశ్రా చెప్పారు. ఆగస్టు నెలలో జరగనున్న ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పలు రాష్టాల్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖలు పాల్గొంటారని ట్రస్టు సభ్యులు వివరించారు.