కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో షూటింగ్ లు ఆగిపోయాయి. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా షూటింగ్ లు జరుపుకోలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానుల ముందుకు వస్తున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ శ్రియ అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఓ అభిమాని ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అడగగా రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లతో నటించటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.
మరో అభిమాని ప్రభాస్ గురించి అడగగా ప్రభాస్ మంచి నటుడే కాకుండా మంచి స్నేహితుడు అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ప్రభాస్ కళ్ళు అంటే ఏంటో ఇష్టమని తెలిపింది. అవి మంత్రముగ్ధుల్ని చేస్తాయంటు చెప్పుకొచ్చింది.